Manasu Maree lyrics

by

Amit Trivedi



మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించెయ్ నన్నల్లి
కిలాడి కోమలి గులేబకావళి
సుఖాల జావళి వినాలి కౌగిలి
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల
ఓ... అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా
బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా
పూల నావ గాలి తోవ హైలోహైలెసో
చేరనీవా చేయనీవా సేవలేవేవో
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల
మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది
మనువుతో మొదలయే మరో జన్మాన్నై పుట్టే వరమిది
నీలో ఉంచా నా ప్రాణాన్ని
చూసి పోల్చుకో
నాలో పెంచా నీ కలలన్నీ
ఊగనీ ఊయల్లో
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే
ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే
నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించెయ్ నన్నల్లి
కిలాడి కోమలి గులేబకావళి
సుఖాల జావళి వినాలి కౌగిలి
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z #
Copyright © 2012 - 2021 BeeLyrics.Net